సంగం పాలకవర్గము అధికారులు ఉత్పత్తులు అమ్మకందారులు వినియోగదారులకు ఉత్పత్తిదారులకు వార్తలు సంప్రదించు

మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ఖైరా జిల్లాలో పాల ఉత్పత్తి దారులు జరిపిన వీరోచిత పోరాటమును “అమూల్” జ్నప్తికి తెచ్చును. రైతులు తమ పాలకు సరియైన, సమంజసమైన ధర లభించనందున శ్రీ వల్లభాయ్ పటేల్ గార్కి మొర పెట్టుకోగా వారు శ్రీ మొరార్జీదేశాయ్ గార్ని పంపగా వారు రైతుల పాలకు సరసమైన ధర లభించవలెనన్నచో పాల ఉత్పత్తిదార్లందరూ సహకార సంఘాలుగా ఏర్పడవలెననియూ, సదరు సంఘాలన్నీ ఒక సమితిగా ఏర్పడవలెననిరి. ఈ విధముగా 1946 వ సం. డిసెంబరు 14వ తేదీన ది ఖైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ ఆనంద్ లో రిజిష్టరు కాబడి స్థాపీంచబడినది. ఈ యూనియన్ ఆధీనములో ఒక మిల్కు ప్రాసెసింగ్ ప్లాంటు, పదార్ధముల తయారీ కర్మాగారము, పశుదాణా కర్మాగారము తదితర యూనిట్లు పనిచేయును. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ను షార్టు పేరుగా “అమూల్” అందురు. 1964 వ సం.లో అమూల్ చే స్థాపించబడిన దాణా కర్మాగారమును ప్రారంభించుటకు విచ్చేసిన నాటి ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి , పాల సంఘాలు పనిచేయుచున్న తీరును ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడంలో పాల సంఘాల పాత్రతో ముగ్దుడై అమూల్ జనరల్ మేనేజరు డా.వి.కురియన్ గారిని ఇలాంటి పాల ఉత్పత్తిదారుల వ్యవస్థనే దేశమంతటా రూపోందించమని కోరినారు. ఇందుకొరకై డా. వర్గీస్ కురియన్ గారి అధ్యక్షతన జాతీయ పాడి పరీశ్రమాభి వృద్ధి సంస్థ (NDDB) నెలకొల్పబడినది. వీరు క్షీర విప్లవ సారధిగా దేశ ప్రజల గుండెలలో నిలచినారు. అమృతా పటేల్ గారు ప్రస్తుత అధ్యక్షురాలిగా యున్నారు.

 

గుంటూరు, కృష్ణా మరియూ పశ్చిమ గోదావరి జిల్లాల పాల ఉత్పత్తిదారుల ఒక రోజు పాల కిమ్మత్తు విరాళంగా ఇవ్వటం ద్వారా 34.46 యకరముల స్థలము 1973-74 లో కొనుగోలు చేసి NDDB పాల వెల్లువ పధకము 1 క్రింద సంగం డెయిరీ స్థాపన జరిగినది. ది గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ 23.02.1977 న రిజిష్టర్ కాబడినది. యూనియన్ వ్యవస్థాపన అద్యక్షులుగా గౌ.శ్రీ యడ్లపాటి వెంకట్రావు గారు నియమితులైనారు. తదుపరి మరో 53 యకరములు కొనుగోలు చేయడం జరిగినది. వీరి పాలనలో డెయిరీలో రిజిష్టరు కాబడిన సహకార సంఘముల సంఖ్య 81 కి విస్తరిల్లినది. తదుపరి 1979వ సంవత్సరంలో శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారు ఎన్నిక ద్వారా యూనియన్ ఛైర్మన్ అయినారు. వీరు అనేక నూతన ప్రయోగాలు డెయిరీలో చేపట్టి, పాల సేకరణ, విక్రయము మరియు వివిధ పదార్ధముల తయారీ ప్రక్రియల ద్వారా నూతన మార్గములస్వేషించి డెయిరీ అభివృద్ధిని ద్విగుణీకృత పరచినారు. డెయిరీలో పశువైద్యము కృత్రిమ గర్భోత్పత్తి విధానములలో అనేకమంది సంఘముల సిబ్బందికి శిక్షణ ఇప్పించి, జాతి గేదెల ఉత్పత్తికి దోహదపడినారు. పాడి పశువుల కొనుగోలుకై బ్యాంకర్లతో సమావేశములనేర్పరచి సంగం పాడి పశువుల ఋణ పధకము అమలుపరచిరి. జిల్లాలోని మూల మూలలలో పాల సంఘాల నేర్పరచి పాడి పరిశ్రమాభివృద్దికి విపరీతముగా కృషిసల్పిరి. దీని వలన 500 లకు పైగా సహకార సంఘములు రిజిష్టరు కాబడినవి. తద్వారా జిల్లా పాల ఉత్పత్తిదారుల హృదయాలలో పాల వీరయ్యగా చిరస్మరణీయుడైనారు.

 

నాటి ముఖ్యమంత్రి కీ.శే. శ్రీ యన్.టి.రామారావు గారు 1995 పరస్పర సహాయక సహకార సంఘముల చట్టం చేయడం ద్వారా రాష్ట్ర పాడి పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చారు. తద్వారా 1.2.1997 న సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయక సహకార సంఘముల చట్టము 1995 క్రిందకు అనువర్తన చేయడమైనది. ప్రస్తుతము 550 సహకార సంఘములు, 600 పాల సేకరణ కేంద్రములు మరియు 400ల వెండారు పాయింట్లు మన డెయిరీకి అనుబంధముగా పాల సేకరణ గావించుచున్నవి. డెయిరీ పాల ఉత్పత్తి దారులు పాలకు సరాసరిన 1995-96 లో రూ.9.14 పై.లు పోందగా 2009-10 లో రూ.22.82 పై.లు పొంది యున్నారు. అలాగే ధరలవ్యత్యాసము 1995-96 లో లీటరుకు రూ.0.40 పై.లు పోందగా 2009-10 లో ఒక రూపాయుచొప్పున పొంది యున్నారు. పాల అమ్మకం 1995-96 లో 161 లక్షలు కాగా 2009-10 నాటికి 695 లక్షలకు చేరినది. ఉద్యోగుల జీత భత్యాల క్రింద 1995-96 లో 4.93 కోట్లు పొందగా 2009-10 నాటికి 23.6 కోట్లు పోంది యున్నారు. యూనియన్ షేర్ క్యాపిటల్ 1995-96 లో 2.39 కోట్లు కాగా 2009-10 నాటికి 9.5 కోట్లుగా యున్నది. యూనియన్ టర్నోవర్ 1995-96 నాటికి 57 కోట్లు కాగా 2009-10 నాటికి 238 కోట్లకు చేరినది. ఈ విధంగా 1995 చట్టము వలన అంచెలంచెలుగా ఎదిగి దక్షిణ భారత దేశములో అగ్రగామి డెయిరీగా పేరు ప్రఖ్యాతలు పొందినది. ప్రస్తుతం డెయిరీ ఛైర్మన్ గా కీ.శే. శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారి కుమారుడైన శ్రీ నరేంద్రకుమార్ గారు తనదైన శైలిలో డెయిరీని త్వరితగతిన మరింత అభివృద్ది చేయుటకు కృషిసల్పుచున్నారు.

Site best viewed above 1024x768 resolution.